Header Banner

హైదరాబాద్ లో నేడు కాల్పుల కలకలం! అతడిపై పలు కేసులు.. గాయపడ్డ కానిస్టేబుల్‌!

  Sun Feb 02, 2025 13:24        India

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో నేడు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దొంగ పోలీసులపై కాల్పులు జరిపాడు. దొంగ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ కు వచ్చాడన్న సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు వచ్చారు. పోలీసులను గమనించిన దొంగ వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకట్రామ్ రెడ్డికి, ఓ బౌన్సర్ కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఎట్టకేలకు పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ దొంగను పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గా గుర్తించారు. అతడిపై పలు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. కాగా, గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ ను, బౌన్సర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Gachibowli #Firing #Thief #Police #PubHyderabad